TRINETHRAM NEWS

బస్సు సమయాన్ని మార్చండి, ఆర్టీసీ ఎండికి వినతి పత్రం. అరకు నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి – కొర్ర శేషగిరిబాబు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పెదబయలు ) జిల్లాఇంచార్జ్ : పాడేరు నుండి పెదబయలు, లింగేటి మీదుగా బొంగరం వరకు నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం సమయాన్ని మార్చాలని, బస్సు కచ్చితంగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని, చాలా సందర్భాల్లో గొమంగి నుండి బస్సు తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి ఉందని, ఇదే బస్సు పై ఉపాధ్యాయ, ఉద్యోగ సచివాలయ సిబ్బంది, వ్యాపారస్తులు, మరియు సాధారణ ప్రజలు ప్రయాణం చేయుటకు ఒకటే బస్సు కావడంతో బొంగరం,ఇంజరి తదితర పంచాయతీల ప్రజలు ఇదే బస్సుపై ఆధారపడి ఉన్నారు.

కావున మధ్యాహ్నం సమయాన్ని మార్చి కచ్చితంగా బస్సు రోజు వారీగా తిరిగేలాగా చూడాలని, పాడేరు డివిజనల్ మేనేజర్ డీఎం కి వినతిపత్రం ఇచ్చి సమస్యలను వివరిస్తున్న అరుకు నియోజకవర్గ తెలుగుయువత అధికార ప్రతినిధి కొర్ర శేషగిరిబాబు. ఆర్టీసీ డి ఎం స్పందిస్తూ బస్ మధ్యాహ్నం సమయాన్ని మార్చి రోజు వారీగా తిరిగేలాగా చర్యలు తీసుకుంటానని, చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో బొంగరం పంచాయతీ మాజీ సర్పంచ్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

APSRTC