సొంత నిధులతో గ్రామాల రోడ్డు సమస్యను తీర్చిన ఇన్చార్జి చంద్రశేఖర్
మూడు గ్రామాల రహదారి సమస్య పరిష్కారం
కృతజ్ఞతలు తెలిపిన అయా గ్రామాల ప్రజలు…
Trinethram News : పెద్దారవీడు:మండలంలోని కలనూతల, సుంకేసుల,గుండంచర్ల, తదితర గ్రామాలకు పోవాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిందేనని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.గత కొన్ని రోజులుగా మార్కాపురం నుండి గుండంచర్ల, కలనూతల,సుంకేసుల తదితర గ్రామాలకు వెళ్లే కొండ పై రహదారి పూర్తిగా మట్టి కొట్టకపోయి రాళ్ల బయటపడడంతో వాటి మీద ప్రయాణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగాల్సింది వస్తుందని ఆయా గ్రామాల ప్రజలు రహదారి సమస్య తీవ్రతను సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్, వైసీపీ నాయకులు ఆవిషయాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వైసీపీ నూతన సమన్వయకర్తగా నియమతులైన తాటిపర్తి చంద్రశేఖర్ దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించి రహదారి సమస్యను పరిష్కరించేందుకు ఎంత ఖర్చవుతుందో పూర్తి చేసి చెప్పండి చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో మంగళవారం సర్పంచి గుడ్డెపోగు రమేష్ రహదారి గుంతలను మట్టి తోలించి సదును చేసి బాగు చేయడం జరిగింది. సమస్య తీవ్రతను ఇన్చార్జికి తెలియజేసిన వెంటనే స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించినందుకు నూతన సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ కు సుంకేసుల, కలనూతల సర్పంచులు రమేష్, కిరానాయక్,ఆయా గ్రామల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.