
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సమయంలోనే చంద్రబాబు కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. వైసీపీ నుంచి అభ్యర్థులను దాదాపు ఖరారు చేయటంతో తమ అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన జాబితా సిద్ధం కావటంతో.. రెండు పార్టీల నుంచి మొత్తం 175 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
