TRINETHRAM NEWS

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు అయోధ్యకు వెళుతున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురూ హాజరు కానున్నారు..

ఇప్పటికే వీరిద్దరికీ ఆహ్వానం రావడంతో వీరిద్దరూ ఈరోజు బయలుదేరి అయోధ్యకు చేరుకోనున్నారు. రాత్రికి అయోధ్యలోనే బస చేసి రేపు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఇరువురూ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి..

రా కదలిరా వాయిదా…మరోవైపు చంద్రబాబు అయోధ్య పర్యటనతో ఈ నెల 25న కర్నూలు జిల్లా పత్తికొండలో జరగాల్సిన రా కదలిరా సభ వాయిదా పడింది. అయోధ్యకు వెళ్లాల్సి రావడంతో సభను వాయిదే వేసుకుంటున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ నెలాఖరులో సభను నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎప్పుడనేది తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు..