స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు
Trinethram News : అమరావతి: జగన్ రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ.. స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు..
వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన ప్రజల జీవితాల్ని చీకటిమయం చేసిందని, పండుగ సంతోషాన్ని ప్రజలకు దూరం చేసిందని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుక్రవారం ఓ ప్రకటనలో భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ”మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇదే సరైన సమయం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేం చేసే పోరాటంలో భాగస్వాములవ్వండి. చేయిచేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దాం” అని చంద్రబాబు తెలిపారు..