Trinethram News : జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ ఝార్ఖండ్ సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపైకి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం అందించారు.
అయితే, మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సంకీర్ణ కూటమి తమ శాసనసభపక్ష నేతగా చంపైని ఎన్నుకుంది.
దీంతో ఆయన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిశారు.