Chalo RG1 Gium Office -CITU for redressal of workers’ problems
ఎరవల్లి ముత్యంరావు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
GDK11 ఇంక్లైన్ లో ఉదయం ఏడు గంటలకు జంగాపల్లి మల్లేష్ అధ్యక్షతన కార్మికులతో సమావేశం జరిగింది, ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యం రావు మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎన్నికల ముందు కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామన్నారని, అలవెన్స్లపై ఇన్కమ్ టాక్స్ తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, బొగ్గు బ్లాక్ ల ప్రవేటికరణ అడ్డుకుంటామని, కార్మికులకు వాస్తవ లాభాలు ప్రకటించి 35% వాటా చెల్లిస్తామని ఇలా అనేక రకాల వాగ్దానాలు చేసి ఈరోజు వాటి పరిష్కారానికి చొరవ చూపకుండా,
సింగరేణి నిధులను దారి మళ్లించే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతుందని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, సింగరేణి కి రావాల్సిన 30 వేల కోట్ల రూపాయల బకాయిలను ఇప్పటివరకు చెల్లించలేదని, కొత్త గనులు రాలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు తెలంగాణకు ఆర్థికపరమైన సంక్షేమ పథకాల విషయంలో వెన్ను దన్నుగా నిలుస్తున్న సింగరేణి సంస్థ కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించారు, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా రెండు సంవత్సరాల కాల పరిమితితో గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందని,
కార్మికుల సమస్యలపై ప్రశ్నించడంలో గుర్తింపు సంఘం అని చెప్పుకుంటున్న ఏఐటియుసి ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టియుసి రెండు కూడా ప్రభుత్వ యజమాన్య అనుకూల సంఘాలుగా మారి కార్మికుల హక్కులు తాకట్టు పెట్టాయని, అందుకే సిఐటియు నిరంతరం కార్మిక సమస్యల మీద పోరాడుతూ ఆగస్టు 20 నుండి 28 వరకు సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టి సంబంధిత గని మేనేజర్లకు వినతి పత్రాలు అందడంతో పాటు 28న అన్ని జియం ఆఫీస్ ల ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి జియం గార్లకు వినతి పత్రాలు అందించి డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు 28న RG1,
జియం ఆఫీస్ ముందు జరిగే ధర్నాను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు, అనంతరం కార్మికుల సంతకలతో కూడిన వినతి పత్రాన్ని వెల్ఫేర్ ఆఫీసర్ అందించడం జరిగింది, ఈ సమస్యల పరిష్కారంలో యజమాన్యం ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే కార్మికులను కార్మిక సంఘాలను ఐక్యపరిచి ఐక్య ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, సంయుక్త కార్యదర్శి జెల్ల గజేంద్ర, ఏ శంకరన్న, పిట్ కార్యదర్శి జంగాపల్లి మల్లేష్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి నవీన్ కుమార్, సిహెచ్ దేవేందర్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App