డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది.
ఈ ఆదేశాల ప్రకారం సామాజిక మాధ్యమం వారు నిషేధిత కంటెంట్‌ను, ప్రత్యేకించి IT నిబంధనల క్రింద పేర్కొన్న వాటిని స్పష్టంగా, ఖచ్చితంగా వినియోగదారులకు తెలియజేయాలని అడ్వయిజరీలో సూచించారు.
ఇటీవల ప్రధానమంత్రి కూడా ఈ డీప్ ఫేక్ దృశ్యాలు, ఫోటోల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై తగు మార్గదర్శకాలు ఉండాలని సూచించారు.