TRINETHRAM NEWS

Case of attack on TDP office – YSRCP leaders remanded as key accused

Trinethram News : గుంటూరు జిల్లా, మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురి నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్​ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

నిందితుల్లో గుంటూరు కార్పొరేటర్​ అచ్చాల వెంకటరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్​ దేవానందం, మస్తాన్​ వలి, గిరి రాంబాబు, షేక్​ ఖాజా మొహిద్దీన్​ ఉన్నారు

వైఎస్సార్సీపీ కీలక నేతల ప్రమేయంపై దర్యాప్తు :

ఇప్పుడు విచారణ వేగవంతం కావడంతో వైఎస్సార్సీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, విజయవాడ నగరపాలక వైఎస్సార్సీపీ ప్లోర్ లీడర్, విజయవాడ కార్పొరేటర్ తదితరులను నిందితులుగా చేర్చారు.

మొత్తం ఇప్పటివరకు 56 మందిని నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. త్వరలోనే మరి కొందరిని అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

దీంతో కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రం వదిలి పారిపోయినట్లు గుర్తించారు.

దాడిలో పాల్గొన్నవారు విజయవాడ నగరంలోని గుణదల, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా వైకాపా నేత దేవినేని అవినాశ్‌ అనుచరులుగా తేలింది.

నిందితుల్లో పలువురు కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. 18వ డివిజన్‌ కార్పొరేటర్, వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ అరవ సత్యం, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ పుప్పాల కుమారి కుమారుడు రాజా, దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు బచ్చు మాధవి, గాంధీ సహకార బ్యాంకు డైరెక్టర్‌ జోగరాజు, మాజీ ఉప మేయర్‌ చల్లారావు, తదితరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి ప్రమేయంపై సాక్ష్యాలు కూడా ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది.

అయితే వీరంతా నేతతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని, ఇబ్బంది లేదని వారిలో భరోసా నింపేందుకు నేత ప్రయత్నిస్తున్నారు. నిందితులు అరెస్టు అయి అసలు సూత్రధారుల పేరు చెబితే ఇబ్బంది అవుతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని కంగారు పడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అవినాష్​ అనుచరుల అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case of attack on TDP office - YSRCP leaders remanded as key accused