
Trinethram News : తెనాలి : పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్లో తరలిస్తున్న 23 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు తెనాలి స్టేషన్లో స్వాధీనం చేసుకున్నారు.
రైలులో ఏ1 బోగీలోని 7, 8, 9, 10 బెర్త్ల్లో అనుమానాస్పదంగా ఉన్న నాలుగు బ్యాగ్లను రైల్వే పోలీసులు పరిశీలించగా..
అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. అందులో 23 కిలోల గంజాయి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితులు బ్యాగ్లు వదిలేసి పరారయ్యారు.
గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
