Calling Kashmir a curse and Hyderabad a liberation is proof of BJP’s politics
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్.
Trinethram News : Medchal : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు నిజాం కు,దొరల ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటన్నీ సీపీఐ నిర్వహించి మొత్తం తెలంగాణ లో నిజాం అధీనంలో ఉన్న 3వేల గ్రామాలను విముక్తి చేసి,10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి,గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసి ప్రజలను వెట్టి చాకిరి నుండి విముక్తి చేసి ప్రజా ప్రబుత్వం ఏర్పాటు చేసి నిజాం ను వశపర్చుకునే సమయంలో ఈ ప్రాంతం ఎక్కడ కమ్యూనిస్టుల చెతిలో కి వెళ్తుందనే భయంతో అనాథను నిజాం, నెహ్రు సర్కార్ వల్లభాయ్ పటేల్ తో సైనికులను పంపించిందే కానీ నిజాంను లొంగదీసుకోవలనే ఉదేశ్యం తో రాలేదని అన్నారు.
ఒక వేల నిజాం ను లొంగదీసుకుంటే నిజాం రాజును,రాజకరర్లను అరెస్టు చేయాల్సింది కానీ వారిని హైదరాబాద్ సంస్థానానికి రాజ్ ప్రముఖ్ గా నియమించి 2 కోట్లు సంవత్సర పెన్షన్ గా ఎలా చెల్లించిందని అన్నారు.
నేడు బీజేపీ వాళ్ళు ముస్లిం రాజైన నిజాం ను గద్దె దించిండు కాబట్టి విమోచనం అంటునమ్మని అంటున్నారు కానీ 1952 వరకు అదే నిజాం రాజప్రముఖ్గా పరిపాలన చేసిండని ఎలా విమోచనం అంటరాని అన్నారు.
రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ ఆనాడు ఆర్ ఎస్ ఎస్ ఉన్నపటికీ ఇక్కడ వాళ్లే చెబుతున్నట్లు హిందు ప్రజలను ముస్లిం రాజకర్లు హింసిస్తుంటే ఆర్ ఎస్ ఎస్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.
ఇవ్వాళ ఆర్ ఎస్ ఎస్ 1925 లో నెలకొల్పినప్పటికి అప్పటికి అటు దేశ స్వతంత్ర ఉద్యమంలో గాని,ఇటు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ పాల్గొనకుండా మతం పేరుతో చెలామణి చేస్తూ ప్రజలకు వాస్తవ చరిత్ర తెలియకుండా చేస్తూ అబద్ధపు చరిత్రను ప్రచారం చేసుకుంటూ స్వాతంత్ర్య, తెలంగాణ అమర వీరులు చేసిన పోరాటాన్ని మత పోరాటంగా చిత్రీకరిస్తోందని విమర్శించారు. ఎన్ని అబద్దాలు ప్రచారం చేసిన వాస్తవాలు ప్రజలకు ఇంకా కళ్ళకు కట్టినట్టు చరిత్ర ఉందని,మతం పేరుతో చేసే ప్రచారం ఎల్లప్పుడూ సాగదని అన్నారు.
ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి కళాకారులు భాస్కర్, కృష్ణ,రాములు,బాలరాజ్ బాబులు పాటలు పాడగా,సీపీఐ కార్యవర్గ సభ్యులు స్వామి, హరనాథ్,శాఖ కార్యదర్శులు సదానంద్, సహదేవరెడ్డి, వెంకటేష్,సుధాకర్, శేఖర మహిళా సమాఖ్య కార్యదర్శి హైమావతి, సత్యవతి, సంధ్య,వనజసీపీఐ నాయకులు యూసుఫ్, వీరాచరి, నర్సయ్య,ఇమామ్, రాజు,ఆదిత్య,చంద్రయ్య,మధు,యాగంటి,ఎల్లయ్య,సాదిక్, నర్సింహ, తదితరులు పాల్గొనగా,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్ వందన సమర్పణలో ముగించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.