TRINETHRAM NEWS

బ్రాహ్మణపల్లి లో ఎద్దుల పండుగ.
త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. వెదురు కుప్పం మండలం బ్రాహ్మణపల్లి లో జల్లికట్టు చాలా ఘనంగా నిర్వహించారు. ఆ ఊరి పెద్దలు పిల్లలు అందరూ ఎద్దులను బాగా అలంకరించి కొమ్ములకు రంగులు వేసి కొప్పులు కొట్టి వాటికి పలకలు కడతారు. ఆ పలకల్లో నెమలి ఈకలు రిబ్బన్లు పెట్టి పెద్ద పలకలు తయారు చేసి ఎద్దులకు కడతారు వాటిని దేవర ఎద్దులు అంటారు ఆ దేవరిద్ధులను పురవీధుల్లో తిప్పుతారు. ఆ తర్వాత చిన్న చిన్న పలకలు కట్టి ఎద్దులకు ముకుతాడు మె డతాడు అన్ని విప్పేసి జల్లికట్టులో వదులుతారు. వాటిని పట్టుకునేందుకు యువకులు పెద్దలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ ఎద్దుల పండుగ చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల యువకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App