TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త నల్ల యాదయ్య ఇటీవల మరణించారు వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో ఈరోజు వారి గ్రామానికి వెళ్లి BRS పార్టీ నుండి మంజురైన రూ.2 లక్షల భీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

BRS పార్టీ… సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు భరోసానిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి… ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి సభ్యత్వం చేయించే ప్రయత్నం చేయాలి.

పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకుంటే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి ఆ వ్యక్తి మరణించినట్లయితే Rs.2,00,000/- భీమా పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది… ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద గ్రామాల్లో ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం లేస్తే కేసీఆర్ ని విమర్శించడం, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తప్ప….. ప్రజలకు సేవ చేయడం మీద ద్రుష్టి పెట్టేలా లేరు.

కెసిఆర్ మాత్రం అధికారం ఉన్నా లేకున్నా ప్రతిక్షణం ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, మండల BRS పార్టీ అధ్యక్షులు నారెగూడెం మహిపాల్ రెడ్డి, వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, రామస్వామి, మండల కార్యనిర్వాహక అధ్యక్షులు పడిగల్ల అశోక్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ శివకుమార్, పట్టణ జనరల్ సెక్రటరీ గాండ్ల మల్లికార్జున్, మండల మైనార్టీ విభాగం అధ్యక్షులు గయాజ్, మాజీ సర్పంచులు మాధవ రెడ్డి, అంజయ్య, మండల BC సెల్ విభాగం అధ్యక్షులు మల్లేష్ యాదవ్*, మండల యువజన విభాగం అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, మండల సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, పట్టణ సోషల్ మీడియా అధ్యక్షులు *మల్లేష్, మండల యువజన విభాగం జనరల్ సెక్రటరీ ఎర్రవల్లి శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్,పులుమద్ది గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటయ్య, సీనియర్ నాయకులు,దేవదాసు, R. మల్లేశం, నాయకులు భాస్కర్, మహిపాల్ రెడ్డి, రమణ, ప్రభాకర్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, పెద్ది అంజయ్య, బాబు నాయక్, రవి, సురేష్ యాదవ్, లింగం, సోను రాథోడ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party membership is