BRS leaders handed over the petition to the in-charge MPDO
కమాన్ పూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కమాన్ పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సోమవారం ఇంచార్జి ఎంపిడీవో శేషయ్య సూరి కి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు
అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వం నిధులు కేటాయించగా పాఠశాలలు ప్రారంభమై సుమారు 20 రోజులు గడుస్తున్నప్పటికి టాయిలెట్స్, పారిశుద్ధ్యం, త్రాగునీరుకు సంబంధించిన పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఎటువంటి పనులు ప్రారంభం కాకపోవడం వల్ల సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విన్నవించారు. పనుల నిర్వాహణలో జాప్యానికి సంబంధించిన కారణాలు తెలుసుకుని సౌకర్యాలు కల్పించాలని తగు చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ వినతి పత్రం అందజేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, కమాన్ పూర్ ఏ.ఎం.సి మాజీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, నాయకులు నీలం శ్రీనివాస్, సాగర్ల పవన్, చొప్పరి శ్రీనివాస్, తోట రాజ్ కుమార్ లతో పాటు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App