రాష్ట్రంలో మళ్లీ వచ్చేది BRS ప్రభుత్వమే
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేవెళ్ల నియోజకవర్గం, నవాబ్ పేట లో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి మరియు BRS పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసిందన్నారు. అన్ని రకాలుగా మోసపోయిన ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం మీద ఆవేశంతో రగిలిపోతున్నారన్నారు.అప్పట్లో KCR కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పక్కన పెడుతుందని చెప్పిన మాటలను గుర్తు చేశారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్ర ప్రజలు మళ్ళీ KCR ను కోరుకుంటున్నారన్నారు, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే BRS పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App