TRINETHRAM NEWS

ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్దానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11న నోటిఫికేషన్ వెలువడనుంది. రెండు ఎమ్మెల్సీ స్దానాలకు ప్రత్యేక ఎన్నికల నేపథ్యంలో పోటీ చేయొద్దని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.