Bonala Jana Jatara at Chittiramavarantanda
కొత్తగూడెం అర్బన్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆషాడ మాసం చివరి ఆదివారం గ్రామదేవతలైన పోచమ్మ. మైసమ్మ. దుర్గమ్మ.ముత్యాలమ్మ. మహంకాళి మారెమ్మ.
ఏ పేరుతో పిలిచినా అమ్మవార్లు అందరూ ఒక్కటే.
ఈ ఆస్వాడ మాసంలో వివాహాలై అత్తవారింటికి వెళ్ళిన ఆడపడుచులు పుట్టింటికి తిరిగివచ్చే మాసం ఆసాడ మాసం ఈ మాసంలో వర్షాలు విపరీతంగా పడటం వల్ల వ్యవసాయానికి సరైన అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడంతో పుట్టింటికి చేరిన ఆడపిల్లలు తమ తల్లిదండ్రుల అన్నదమ్ముల కుటుంబాలు చల్లగా ఉండాలంటూ వారి వ్యవసాయ పనులు సవ్యంగా సాగాలంటూ దినదిన ప్రవర్తమానంగా వెలగాలంటూ ఆడబిడ్డలు ఆశీర్వదిస్తూ గ్రామ దేవతలకు పుట్టింట్లో బోనం వండి అమ్మవార్ల అర్పిస్తూ తమ గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ధూప దీప నైవేద్యాలతో డప్పు వైద్యాలతో కోలాట నృత్యాలతో అమ్మవార్లకు అర్పించేదే ఆషాడ మాస భోనం.
ఈ పండుగ తెలంగాణ ప్రాంతంలో తొలి ఏకాదశి మొదలు ఆషాడ మాసం చివరి వరకు కొనసాగించే గ్రామోత్సవాలు. ఈ బోనాల జాతర కొనసాగింపు సందర్భంగా. కొత్తగూడెం మండల పరిధిలో గల చిట్టి రామవరం తండా ప్రాంతంలో అత్యంత వైభవోపేతంగా ప్రతి ఇంటి నుండి ఆడబిడ్డలు కుండలో బోనం వండుకొని పసుపు కుంకుమలతో పూజించి వేప రెమ్మలు కట్టి పొలిమేరలో బొడ్రాయి ప్రాంతంలోనున్న ముత్యాలమ్మ పోచమ్మ ధూప దీప నైవేద్యా బోనాలు ఆదివారం ఉదయం 11 గంటలకు సమర్పించారు.
ఈ బోనాల జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక కౌన్సిలర్. గిరిజన నేత. సిపిఐ నాయకులు. భూక్య శ్రీనివాస్ మాట్లాడుతూ చిట్టి రామవరం తండా బొడ్రాయి సెంటర్ నుండి బోనాల జాతర ప్రారంభించి ప్రతి గడప నుండి కుటుంబ సమేతంగా బోనాలు తీసు కొచ్చి ముత్యాలమ్మ. పోచమ్మ. అమ్మవారికి ధూప దీప బోనాల నైవేద్యం సమర్పించి గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆడపడుచులంతా ఆత్మీయతతో అమ్మవార్లకు బోనం అప్పజెప్పడం అభినందన నియమని గ్రామమంతా మానవతా హృదయంతో కలిసికట్టుగా ఉండి ఇలాంటి సంబరాలు జరుపుకుంటే ఆరోగ్యాలు కూడా ఎంతో బాగుంటాయని అన్నారు.
ఈ బోనాల కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ కౌన్సిలర్ గోబ్రియ నాయక్, లచ్చి రామ్, వసియా, బోడ కృష్ణ, రంగమ్మ, మూడు రమేష్, సక్రం, రాంబాబు, టాకు, జరుపల కృష్ణ, గోవిందు, లక్క, లకావత్ శంకర్, రాంప్రసాద్, మనోజ్, మంగి, బుల్లి, పూర్ణ, సల్కు, తులసి, శ్రీదేవి, లక్ష్మి, కుమారి, విజయ, కావేరి, సరోజ, సునీత,
పాటు గ్రామ ప్రజలు పిల్లాపాపలతో పాటు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App