తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్ అని బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో బిగ్‌బీ అభిమానులు కంగారు పడ్డారు. తాజాగా ఆయన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్‌కు హాజరయ్యారు. అక్కడి మీడియా ప్రతినిధులు ‘అమితాబ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది’ అని అడగ్గా.. ‘బాగున్నాను.. నా అనారోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. అమితాబ్ ఐఎస్పీఎల్ ఫైనల్స్‌లో హుషారుగా పాల్గొని సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్ అవుతున్నాయి.
అమితాబ్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ లో కీలకపాత్రలో కనిపించనున్నారు. మే9న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న ‘తలైవా 170’ లోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్ అని బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు
Related Posts
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్
TRINETHRAM NEWS సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్ Trinethram News : Mumbai : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపిన ముంబై పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని విచారించాక..…
‘సంక్రాంతికి వస్తున్నాం’ అదనంగా 220+ షోలు
TRINETHRAM NEWS ‘సంక్రాంతికి వస్తున్నాం’ అదనంగా 220+ షోలు Trinethram News : విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పబ్లిక్…