Trinethram News : దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్లో ‘ఆర్టికల్ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం.. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో జమ్మూ-కశ్మీర్ ను ఏకీకృతం చేయడంలో సహాయపడిందని తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు, లోక్‌సభ ఎన్నికల్లో తన లక్ష్యానికి ముడిపెడుతూ భాజపా స్పందించడం ఇదే మొదటిసారి.
ఎన్డీయే కూటమిలో ఒడిశా అధికార పార్టీ ‘బీజేడీ’ చేరుతుందా? అనే దానిపై స్పందిస్తూ.. ఏయే పార్టీలు తమతో జట్టుకట్టనున్నాయో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో భాగం కావాలనుకునే పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భాజపా 370, ఎన్డీయే కూటమి 400కు పైగా సీట్లలో గెలుపును లక్ష్యంగా పెట్టుకోవడమనేది అతి విశ్వాసం, అహంకారం నుంచి వచ్చింది కాదని, పదేళ్ల తమ ప్రభుత్వ సుపరిపాలనపై ఉన్న ధీమా అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల ఫలితాలు ప్రపంచ దేశాలనూ ఆశ్చర్యానికి గురిచేస్తాయన్నారు.
ఇదిలాఉండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మొత్తం 303 సీట్లు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం పలువురు ఎంపీల రాజీనామా తదితర కారణాలతో ఈ సంఖ్య 290కు తగ్గింది. ఈసారి 370కుపైగా స్థానాల్లో గెలుపొందాలనే టార్గెట్‌తో ప్రచారం ముమ్మరం చేసింది. లోక్‌సభ ఎన్నికల కోసం ఇటీవల 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన కమలదళం.. మొత్తం 34 మంది కేంద్ర మంత్రులను బరిలోకి దించింది…..
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం
Related Posts
Murder Case : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు
TRINETHRAM NEWS కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు..!! Trinethram News : కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై (Kolkata Doctor Case) హత్యాచార…
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు
TRINETHRAM NEWS గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు Trinethram News : న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల (Delhi election) కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు…