TRINETHRAM NEWS

గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు

Trinethram News : న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల (Delhi election) కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల హామీలకు సంబంధించిన ‘సంకల్ప్ పత్రాన్ని’ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 అందిస్తామని తెలిపారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ స్కీమ్‌ను ఆమోదిస్తామని చెప్పారు. అలాగే గర్భిణీలకు రూ.21,000 అందుతుందని అన్నారు.కాగా, ఎల్పీజీ వాడుతున్న కుటుంబాలకు సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ లభిస్తుందని జేపీ నడ్డా తెలిపారు. హోలీ, దీపావళి సందర్భంగా ఒక్కో గ్యాస్ సిలిండర్‌ ఉచితంగా అందుకుంటారని చెప్పారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని ఢిల్లీలో అమలు చేస్తామన్నారు. రూ.5 లక్షల ఆరోగ్య బీమాకు అదనంగా మరో రూ.5 లక్షల ఆరోగ్య రక్షణను ప్రతికుటుంబానికి కల్పిస్తామని వివరించారు.

మరోవైపు మురికివాడల్లో అటల్ క్యాంటీన్ల ద్వారా రూ.5కే పౌష్టికార భోజనం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వంటి అమలులో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App