బిగ్బాస్ తెలుగు 7 సీజన్ ప్రశాంతంగా ముగిసింది.
అయితే బిగ్బాస్ తెలుగు ఫినాలే తర్వాత అల్లరి మూకలు చేసిన విధ్వంసంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు సెలబ్రిటీల కార్లను, అలాగే ఆర్టీసీ బస్సులపై దాడి చేసి ధ్వంసం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో అధినేత, హోస్ట్ నాగార్జున అక్కినేనిపై అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.