తప్పిన పెను ప్రమాదం.
అల్లూరి జిల్లా అరకులోయ: జనవరి 9.! త్రినేత్రం న్యూస్!
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలం, బస్కి పంచాయతీ, బిజ్జగూడ గ్రామానికి చెందిన కిలో పొల్లు. ఇంటికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తొ కుటుంబానికి ప్రమాదం తప్పింది.
ఈరోజు ఉదయం 9 గంటల సమయం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఇంట్లో ఉన్న మంచాలు బట్టలు, శారిలు, సోళ్ళు ,15000 రూపాయలు ఖరిదు గల తార్పలు ఇతర వస్తువులు కాలి బూడిద అయ్యాయి .
ఆదిమ జాతికి చెందిన పి వి టి జి లకు గిరిజనులకు సరైనా ఇల్లు సౌకర్యం లేక అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర ఉంటున్నాయి. ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కిలో పొల్లు కుటుంబానికి ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. నష్టపోయిన కిలో పొల్లు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని గిరిజన సంఘం మండల నాయకులు సమర్ధి బాబురావు చోడపల్లి ఆనందరావు, చోడపల్లి రామచందర్, చోడపల్లి భాస్కరరావు, చోడపల్లి గురుమూర్తి, తదితరులు డిమాండ్ చేశారు.
సమర్డి బాబురావు మాట్లాడుతూ ప్రమాదంలో నష్టపోయిన కీల్లో పొల్లు కుటుంబానికి కూటమి ప్రభుత్వము ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App