సింగరేణి సహకారంతో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
24 కోట్లతో నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ 15 కోట్లతో పనులను ప్రారంభిస్తున్నాను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం నియోజకవర్గం ప్రజలకు నవ నిర్మాణంగా చూపిస్తా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
కోల్ బెల్టు ను ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని సింగరేణి సంస్థ సహకారంతో గోదావరిఖని పట్టణ చౌరస్తా సమీపంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు గాంధీ మార్కెట్ స్థలంలో నూతనంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సింగరేణి జిఎం లలిత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 24 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతంలో ఊహించని రీతిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, నగర సుందరీకరణలో భాగంగా ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు
ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో సింగరేణి సంస్థను అడిగిన వెంటనే సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రధానంగా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తామన్నారు. చిరు వ్యాపారులకు తాత్కాలికంగా ఇబ్బంది అయినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రణాళికలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతన్నలకు వ్యవసాయాన్ని ఇబ్బంది లేకుండా బండల వాగు ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు
ఎన్టీపీసీ తో పాటు జెన్కో పవర్ ప్లాంట్ ను నిర్మించి పారిశ్రామిక అభివృద్ధితోపాటు అర్హత కలిగిన యువతకు ఉద్యోగ భృతి కల్పిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. సింగరేణి అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో జిఎం లలిత్ కుమార్ సింగరేణి సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App