TRINETHRAM NEWS

భద్రాచలం నెయ్యి కాంట్రాక్టు ప్రైవేటుకే

Trinethram News : నెయ్యి కాంట్రాక్టు విజయ డెయిరీకే ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకొని భద్రాచలం ఆలయం

నిబంధనలు మార్చి సీల్డ్ కవర్ విధానంలో ఈ-టెండర్లలో అనర్హత పొందిన సంస్థకే కేటాయింపు

దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీలో వాడే నెయ్యిని విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను భద్రాచలం ఆలయ అధికారులు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

విజయ డెయిరీని కాదని ఓ ప్రైవేటు డెయిరీకి నెయ్యి సరఫరా టెండర్‌ను కట్టబెట్టారు. తొలుత పిలిచిన ఈ-టెండర్లలో ఆ డెయిరీ డిస్ క్వాలిఫై అయినట్లు విశ్వసనీయ సమాచారం.

ఏం పరిణామాలు జరిగాయో గానీ ఈ-టెండర్లను పక్కన పెట్టి సీల్డ్ కవర్ టెండర్లను పిలిచి ఎల్-1 పేరుతో సరఫరా చేస్తోంది.

కాంట్రాక్టు గడువు ముగిసిపోవడంతో జూన్లో అధికారులు నెయ్యి సరఫరాకు ఈ-టెండర్లు పిలిచారు. కరీంనగర్ డెయిరీతోపాటు ఏపీలోని జంగారెడ్డి గూడెం సమీపంలోని ‘రైతు డెయిరీ’ పాల్గొన్నాయి, కిలో నెయ్యికి కరీంనగర్ డెయిరీ జీఎస్టీతో కలిపి రూ.610, రైతు డెయిరీ రూ.534.24 కోట్ చేశాయి.

రైతు డెయిరీ ఎల్- 1గా నిలిచింది. అయితే, ప్రధాన ఆలయాలకు రెండేళ్ల పాటు నెయ్యి సరఫరా చేసిన అనుభవం, ఏడాదికి రూ. 10 కోట్ల టర్నోవరు ఉండాలన్న టెండరు నిబంధనల్లో రైతు డెయిరీ అర్హత సాధించలేదు.

దీంతో ఆలయ అధికారులు ‘డిస్‌క్వాలిఫై’ విషయాన్ని నోట్ ఫైల్లో రాయగా తర్వాత ఆ పేజీని చించినట్లు తెలిసింది.

ఆలయ ఉన్నతాధికారి ఒకరు ఈ-టెండర్‌ను రద్దు చేసి సీల్డ్ కవర్ టెండర్ పిలిచారు. టర్నోవరు, ప్రధాన ఆలయాలకు సరఫరా చేసిన అనుభవం నిబంధనల్ని తొలగించగా మళ్లీ అవే రెండు డెయిరీలు పాత ధరలే కోట్ చేశాయి.

టీటీడీ లడ్డూల తయారీలో వాడిన నెయ్యి, టెండర్ల విషయం వివాదంగా మారడంతో ఆలయాలు ఇక నుంచి ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ నుంచే నెయ్యి తీసు కోవాలని ఆగస్టు 22న దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రైతు డెయిరీకి నెయ్యి సరఫరా ఆర్డర్‌ను భద్రాచలం ఆలయ ఈఓ కార్యాలయం ఆగస్టు 28న జారీచేసింది.

దీనికి ఆరురోజుల ముందే దేవాదాయశాఖ ముఖ్యకార్యద

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App