Trinethram News : తెలంగాణ : జులై 27
భద్రాచలంలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నిన్నటి వరకు 51 అడుగులకు చేరుకుని మళ్లీ 47 అడుగులకు పడిపోయిన నీటిమట్టం నిన్నటి నుంచి పెరుగుతూ వస్తోంది.
48 అడుగుల లోతుకు చేరుకోవడంతో అధికారులు నిన్న రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఈరోజు ఉదయం ఒక్కసారిగా గోదావరిలో నీటిమట్టం 51 అడుగులకు చేరుకుంది.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా భద్రాచలంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా భద్రాచలంలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత వారం రోజులుగా భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతుండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భద్రాచలం దిగువన ఉమ్మడి మండలాల్లోని పలు గ్రామాలు గత వారం రోజుల నుంచి వరద ముంపునకు గురవుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App