TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్స్ కు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

వేల్పుల కుమారస్వామి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వినతి పత్రం అందజేయడం జరిగింది.
అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ పిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 రూపాయలు ప్రకటించాలి అని అన్నారు. ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆ హామీ ఇచ్చిన విధంగా 18 వేల రూపాయలు ప్రకటన చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, సమ్మె హామీలు అమలు చేయాలని, సౌకర్యాలు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పెండింగ్ సర్వే బిల్లులు చెల్లించాలని, అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లకు కనీస వేతనం చట్టబద్ధ సౌకర్యాలు అమలు కావడం లేదన్నారు గత ప్రభుత్వాలు ఆశ వర్కర్లను విస్మరించిందని ఈ ప్రభుత్వమైన ఆశ వర్కర్ల శ్రమను గుర్తించాలని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18000 వేలు కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ వివిధ పీహెచ్సీల నుండి ఆశ వర్కర్లు పుష్పలత, రాజ కుమారి, పద్మ, సృజన,శ్రీలత,సావిత్రి, రాధ,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App