సెలవు దినంలో కూడా వైద్య సేవలు అందిస్తున్న బస్తి దవాఖాన స్టాప్ నర్స్ ఫర్జానా
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీకి చెందిన బలిద్ బీహారి బోదకాలు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నా పేసెంట్ పరిస్థితిని మడిపెల్లి మల్లేష్ చూసి గోదావరిఖని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్
ఆర్ ఎం ఓ,డాక్టర్ చెంద్రశేఖర్ కు సమాచారం ఇవ్వడంతో గత వారంలో బాధితుని ఇంటి వద్దకు, ఆర్ ఎం ఓ,వెళ్లి పరీక్షించిన విషయం తెలిసిందే ఆరోజు బస్తి దవాఖాన మెడికల్ ఆఫీసర్ నర్మదా మరియు సపోర్టింగ్ స్టాఫ్ నర్స్ ఫర్జానా వీరి సమక్షంలో డాక్టర్ చంద్రశేఖర్ బోధకాలు తో బాధపడుతున్న బలిద్ బీహారి ని పరీక్షించి వారం రోజులకు ఒక్కసారి బాధితుని ఇంటి వద్దకే వచ్చి డ్రెస్సింగ్ చేసి కావాల్సిన మందులు అందజేయాలని బస్తీ దవాఖాన సిబ్బందికి చూసించగా సంక్రాంతి పండుగ సెలవు దినం ఉన్నా గాని మంగళవారం ఉదయం బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాప్ నర్స్ ఫర్జానా వచ్చి బాధిత పేసెంట్ కు డ్రెస్సింగ్ చేసి మందులు ఇచ్చినట్లు కాలని వాసులు తెలిపారు పని దినల్లో సరిగా విధులకు హాజరు కాకుండా ఉన్నా సిబ్బందిని చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి,పీకే రామయ్యా కాలని బస్తి దవాఖాన స్టాప్ నర్స్ ఫర్జానా తన ఉద్యోగం ను దైవంగా భావించి పేదలకు వైద్యం అందించడం స్ఫూర్తి దాయకం, సంక్రాంతి పండుగ సెలవు రోజు కూడా విధులు నిర్వహిస్తున్న ఫర్జానా ను రెండోవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మడిపెల్లి మల్లేష్ అభినందించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App