Trinethram News : 5th Jan 2024
బాపట్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా..మూడవరోజు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, చేస్తున్న దశలు వారి పోరాటం వంట వార్పు,పోరాటం చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు ఎత్తకుండా వ్యవహరిస్తూ మమ్ములను వీధి పాలుచేస్తున్నారు. చిరు ఉద్యోగులమైన మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మా కార్మికులను అందరికీ పర్మినెంట్ చేయ ల ని పలు డిమాండ్లను పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించే వరకు మా యొక్క నిరవధిక సమ్మె ను ఉధృతం చేస్తామని, ముఖ్యమంత్రి పదేపదే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టి, బిసి, మైనార్టీలు ఉండే పారిశుధ్య కార్మికులను విస్మరించటం విచారకరమని రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ బందేల రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డివి సుబ్బారావు జిల్లా అధ్యక్షులు, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్. కోటి దాసు, సెక్రటరీ డి. మాల్యాద్రి, పి. అంకమ్మరావు, ఎన్ సత్యవతి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, దళాయి దుర్గారావు ట్రెజరర్, సాల్మన్, శారద, పద్మావతి, నాగమణి, గోపమ్మ, లక్ష్మి, ఎలిజిబెత్ రాణి, ములక అంకాలు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.