![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.18.20.jpeg)
మలేషియా టౌన్షిప్ ను సందర్శించిన బండి రమేష్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 11 : కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ , ఇంచార్జ్ బండి రమేష్ కెపి హెచ్ బి కాలనీ లోని మలేషియా టౌన్షిప్ ను సందర్శించారు. స్థానికులతో కలిసి ఆయన మంగళవారం టౌన్షిప్ తో పాటు పక్కనే ఉన్న పార్కును పరిశీలించారు. ఇక్కడ పార్కులో టౌన్షిప్ వాసులు మైన మమ్మల్ని కూడా వాకింగ్ కు అనుమతించడం లేదని ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే అందుకు గంటల లెక్కన ఫీజు వసూలు చేస్తున్నారని వారు రమేష్ దృష్టికి తీసుకువచ్చారు. పార్కు ప్రభుత్వ స్థలమైనా నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు.
దీంతోపాటు టౌన్షిప్ పరిసరాలన్నీ అపరిశుభ్రత తాండవిస్తోందని క్లీనింగ్ సరిగా లేదని వీధి దీపాలు లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు .దీనిపై స్పందించిన రమేష్ వెంటనే జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ లతో మాట్లాడారు.పార్క్ నిర్వహణ తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారం కోసం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు టౌన్షిప్ వాసులతో కలిసి జోనల్ కమిషనర్ ను మూసాపేట మున్సిపల్ కార్యాలయంలో కలవనున్నట్లు తెలిపారు. పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాటు ఫుట్ పాత్ లు నిర్మాణం, గ్రీనరీ వంటి అంశాలపై ఆ శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, శివ చౌదరి, టౌన్షిప్ అసోసియేషన్ ప్రతినిధులు సాయి చౌదరి, రవివర్మ, కాకర్ల సురేష్, బి బ్లాక్ అధ్యక్షరాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Bandi Ramesh visited Malaysia](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.18.20-1024x576.jpeg)