TRINETHRAM NEWS

శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి జన్మదినం సందర్భంగా శ్రీనివాస్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలులో పాల్గొన్న,శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ చైర్మన్, డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి జన్మదినం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ కొలన్ చంద్రశేఖర్ రెడ్డి & ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు నాగార్జున ఆచార్యులు (లాలు స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాతఃకాల సమయమందు స్వామివారికి అర్చన, దేవాలయ ముఖ మండపంలో పడిపూజ కార్యక్రమము, పుష్పాభిషేకము ప్రత్యేక పూజలులో పాల్గొన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, సురేష్ రెడ్డి .అనంతరం సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్బంగా ఎంఎంసీ కాపు సేవ సమితి ముద్ర గల రాఘవేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, హరి బాబు, సతీష్,గురు స్వామి వెంకట్ రెడ్డి, కుమార్ రెడ్డి, దీపక్, కాపు సేవ సమితి సభ్యులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.