Ayushman Bharat for Senior Citizens. Center gives key instructions to states on registration
70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్
పేర్లు నమోదుకోసం మొబైల్ యాప్, వెబ్ పోర్టల్
మిగతా ఆరోగ్య బీమా పథకాల లబ్దిదారులకు వర్తింపు
Trinethram News : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం. పేదలకు ఆరోగ్య బీమాను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయం అందుతుంది. అయితే, తాజాగా, ఈ పథకాన్ని 70 ఏళ్లు నిండిన సీనియర్లకు వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలో పథకంలో చేరే లబ్దిదారులు పేర్లను నమోదు కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
ఈ పథకంతో ప్రయోజనం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల నమోదుకు ఆయుష్మాన్ మొబైల్ యాప్ (Ayushman), వెబ్సైట్లో (Beneficiary.nha.gov.in) ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App