TRINETHRAM NEWS

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి

డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి, మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి, హోంగార్డ్స్‌ మరియు ఆర్గనైజేషన్ అడిషినల్‌ డీజీపీ స్వాతి లాక్రా

ములుగు జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ములుగు జిల్లాలోని ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలని, యువత డ్రగ్స్ కి బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగును మార్చాలని,గ్రామీణ యువత నిషేధిత మావోయిస్టు భావజాలానికి లోను కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని, మావోయిస్టు కార్యకర్తలపై అనునిత్యం నిగా ఉంచాలని, ములుగును మావోయిస్టు రహిత జిల్లాగా మార్చాలని ఆర్గనైజేషన్ మరియు హోంగార్డ్స్‌ అడిషినల్‌ డీజీపీ స్వాతి లక్రా అధికారులకు సూచించారు వార్షిక తనీఖీల్లో భాగంగా ములుగు జిల్లా పోలీస్‌ తనీఖీకై

ఈ రోజు ఉదయం ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకున్న అడిషినల్‌ డీజీపీ ములుగు జిల్లా ఎస్పీ డా.శబరీష్.పి ఐపీఎస్ పుష్పాగుచ్చాలు అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు వందనం చేసారు. ఈ తనీఖీలో భాగంగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో ములుగు జిల్లాకు చెందిన పోలీస్‌ అధికారులతో సమావేశమయిన అడిషినల్‌ డీజీపీ కి ముందుగా ములుగు జిల్లా విభాగం పనీతీరును, శాంతి భద్రత నియంత్రయణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై జిల్లా ఎస్పీ పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా వివరించారు.

ఈ సందర్బంగా అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ నేర నియంత్రణలో ములుగు జిల్లా పోలీస్ చేస్తున్న కృషిని, శాంతి భద్రతల్లో తీసుకుంటున్న రక్షణ చర్య లను, లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే మహిళలకు సంబంధించి ఫిర్యాదులకు అధిక ప్రధాన్యత ఇవ్వాల్సి వుంటుందని, మహిళ రక్షణకై ఏర్పాటయిన షీ టీం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, షీ టీంలో ఇచ్చే ఫిర్యాదుల విషయం అధికారులు సున్నితంగా వ్యహహరించాల్సి వుంటుందని, బాధితులకు న్యాయం కల్పించడంతో పాటు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, డయల్‌ 100 నుండి వచ్చే ఫిర్యాదులపై స్టేషన్‌ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవాలని, సైబర్‌ నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై స్టేషన్‌ అధికారులు తప్పక కేసు నమోదు చేయాలని, కోర్టుల్లో ట్రయల్స్ లో ఉన్న కేసులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా విద్యార్థుల్లో ట్రాఫిక్‌, మత్తుపదార్థాలు , సైబర్‌ నేరాలు, ర్యాగింగ్‌లపై అవగాహన కల్పించేందుకు ప్రతి కళాశాలలో సేప్టీ వుమెన్‌, యాంటీ డ్రగ్స్‌, ట్రాఫిక్‌ స్టేఫ్టీ, ర్యాగింగ్ కు లోను కాకుండా యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు క్లబ్స్‌ను ప్రతి పీఎస్ పరిధిలో ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, వీటీపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలకోసం నిరంతరం తనీఖీలు కోనసాగించాలని అడిషినల్‌ డీజీపీ తెలిపారు.

అనంతరం జాకారంలోని డిటిసి సెంటర్ ను, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లోని డాగ్‌ స్కాడ్‌, ప్రస్తుత డిపిఓ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమములో ములుగు జిల్లా ఓఎస్డి గీతే మహేష్ బాబా సాహెబ్ ఐపీఎస్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, ఏటూరునాగారం ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ములుగు డి.ఎస్.పి రవీందర్ తో పాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐ లు ఎస్సైలు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App