TRINETHRAM NEWS

Awareness of new laws needed: Police Commissioner M. Srinivas, IPS

రామగుండం పోలీస్ కమీషనరేట్

కమీషనరేట్ పోలీసులకు ముగిసిన నెల రోజుల శిక్షణా తరగతులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

దేశంలోని నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అన్నారు. భారతీయ న్యాయ సంహిత(BNS),భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(BNSS),భారతీయ సాక్ష్యా అధినియం-2023పై పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి నెల రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు ఈరోజుతో ముగిశాయి.

అడిషనల్ డిసిపి రాజు అధ్వర్యంలో కమీషనరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్,ఐపిఎస్., (ఐజి) హాజరై అధికారులు, సిబ్బంది తో మాట్లాడారు. జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ చట్టాలు అమలులోకి వస్తున్నాయని అన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించామని తెలిపారు.

కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు.

అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు. కమీషనరేట్ వ్యాప్తంగా నూతన చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించి, శిక్షణా తరగతుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు. నెల రోజులపాటు సమయపాలన పాటిస్తూ అందరికీ అర్థమయ్యేలా తరగతులు బోధించిన ఎసిపి మల్లారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ లు రాజేష్, వినీత, సంతోష్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.వంశీకృష్ణ, బి శ్రీనివాస్, కే రాము, ఏ సంతోష్, కే శ్రీనివాస్, కానిస్టేబుల్ కే తిరుపతి, ఎన్. శ్రీనివాస్ లను సిపి ప్రశంస పత్రాలు అందచేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్సీ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ లు రాజేష్, వినీత, తదితరులు పాల్గొన్నారు

Awareness of new laws needed: Police Commissioner M. Srinivas, IPS