TRINETHRAM NEWS

మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం

  • ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
  • సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయకపోతే చావు డప్పులు మోగిస్తాం
  • ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పై మేము వ్యతిరేకం కాదు
  • ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ వెల్లడి

రాజమహేంద్రవరం జనవరి 29 :

మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం గా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడికి భారత ప్రభుత్వం పద్మిశ్రీ అవార్డు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు ఇవ్వడం గా భావిస్తున్నామని వివరించారు. మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలతో పాటు మానవీయ్య ఉద్యమాలు ఎన్నో చేశారని తెలిపారు. గుండె జబ్బు పిల్లలు వైద్యం అందగా వేలాదిమంది మృత్యువాత పడుతుంటే ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలని ఉద్యమం చేపట్టిన కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చారని తెలిపారు. అలాగే దివ్యాంగులు, వితంతువులు, వృద్దులు
గౌరవంగా జీవించేందుకు లక్షలాదిమందితో ఉద్యమం చేపట్టి వారికి రూ 4వేల రూపాయలు పెంచే విధంగా ఉద్యమించారని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తిరిగి అమలు చేసేందుకు ఉద్యమం చేసి ఆ చట్టాన్ని పునరుద్ధరించారని అన్నారు. మానవీయ్య కోణంలో అనాధ పిల్లల కోసం రాష్ట్రప్రభుత్వం హాస్టల్స్ ఏర్పాటు చేసి బాధ్యత ప్రభుత్వం తీసుకునే విధంగా సామాజిక ఉద్యమం చేశారని అన్నారు. సామాజిక ఉద్యమకారుడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలను సమీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చునని తీర్పు ఇచ్చిందని తీర్పు వచ్చిన 15 నిమిషాలలో అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారని చట్టబద్ధంగా ఆలస్యమైతే ఆర్డినెన్స్ తెచ్చి మరి అమలు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు . కొందరికి ఒత్తిడి మేరకు ఎస్సీ వర్గీకరణ వలలో జాతీయం చేస్తున్నారని అన్నారు.

ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ లోపు ఎస్సీ వర్గీకరణ అమలు పై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ పై చర్యలు తీసుకోకపోతే హైదరాబాదులో రేవంత్ రెడ్డికి చావు డప్పులు మోగిస్తామని హెచ్చరించారు. వర్గీకరణకు అనుకూల చర్యలు చేపడితే విజయోత్సవ డప్పులు మ్రోగిస్తామని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తానని పాలుకూలంగా స్పందించారని దీనికి అనుకూలంగా రాజీవ్ రంగ మిశ్రా కమిషన్ వేసి 59 ఉప కులాలకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు.

చంద్రబాబు నాయుడు పై తమకు విశ్వాసం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్టీసీ ఉద్యోగాల నియామకం ప్రక్రియ నిలుపుదల చేసి రాజీవ్ రంగా మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ప్రజా గాయకుడు గద్దర్ కు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు. ప్రభుత్వ విధానాలపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయమని అన్నారు. ఎమ్మార్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సుబ్బారావు మాదిగ , ఎమ్మెస్పీ జాతీయ నాయకులు వైరాల అప్పారావు మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేసారని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుల సమావేశం బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరగనున్న లక్ష డబ్బులు వేల గొంతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గడ్డం వినోద్ మాదిగ ముమ్మిడివరపు చీర సుబ్బారావు మాదిగ వైరాల అప్పారావు మాదిగ ఎమ్మెస్ కి జిల్లా ప్రధాన కార్యదర్శి మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి , నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App