Auction of Singareni coal mines should be stopped
బొగ్గు గనుల వెలాన్ని నిలిపివేయాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి
జులై 17న బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటాం
ఖనిలో ఏఐటీయూసీ చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపిన DHPS నాయకులు మద్దెల దినేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి నేరుగా సింగరేణికే కేటాయించాలని
దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్పిఎస్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి నేరుగా సింగరేణికే కేటాయించాలని జులై 8వ తేది నుండి 12వ తెదివరకు ఏఐటీయూసీ చేస్తున్న దీక్షలో శుక్ర వారం రోజున దళిత హాక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సంఘీభావం తెల్పడం జరిగిందన్నారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా (ఏఐటీయూసీ) సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు పోరాడుతున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి, పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైందని ఆరో పించారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గనులను ప్రైవేటు కు అప్పగించిన మోదీ ప్రభుత్వం తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి దగ్గర ఉన్న బొగ్గు గనులను వేలం వేయడానికి సిద్ధమైందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా దేశంలో నిరుద్యోగాన్ని పెంచి మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ పార్లమెంటు సభ్యులు ఉన్నా , కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రశ్నించకపోవడం సిగ్గు చేట్టన్నారు.
ఇక పోతే బొగ్గు గనుల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డగా పేరు చెప్పుకుంటున్న కిషన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ తెలంగాణకే గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే దిశగా ఆలోచనలు మానుకోవాలని తమ ప్రభుత్వానికి మోడీకి ఎందుకు చెప్పడం లేదని వారు ప్రశ్నించారు బొగ్గు గనుల వేలానికి ఈ నెల 17 న వేలానికి సిద్ధమవడం సిగ్గుచేటని యావత్ సింగరేణి కార్మికులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడ్డుకుంటామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలని హెచ్చరించారు.
దేశానికి వెలుగులు నింపే సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కదం తొక్కిన కన్నెర్ర చేసిన కార్మికులు 50 రోజులకు పైగా సమ్మె చేసి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన చరిత్ర సింగరేణి కార్మికులదని , అలాంటి సింగరేణి కార్మికులు సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే, కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదానికి, అంబానీకి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్న మోడీని, మోడీ ప్రభుత్వ పునాదులను పెకిలిస్తారని ఆయన హెచ్చరించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్మికులను మోసం చేస్తూ బొగ్గు గనుల వేలానికి సిద్ధపడటం సిగ్గుచేటని , వెంటనే రాజీనామా చేయాలని దినేష్ డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App