TRINETHRAM NEWS

జర్నలిస్టుల పై దాడి సరికాదు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి
టీయూడబ్లూజే (ఐజేయు)
జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లినజర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం సరైన పద్ధతి కాదని టీయూడబ్లూజే (ఐజేయు)
జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్ అన్నారు.గత మూడు రోజుల క్రితం సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుల పై దాడి చేయటాన్ని వ్యతిరేకిస్తూ,మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలని కోరుతూగురువారం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ను ఆయన ఛాంబర్ లో కలిసి టీయూడబ్లూజే (ఐజేయు) జిల్లా శాఖ తరుపున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…న్యూస్ కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టు లపై మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.కుటుంబ ఇంటి పంచాయతీ ఏమైనా ఉంటే ఇంట్లోనే పంచాయతీ చేసుకోవాలని బయటకు వచ్చి పంచాయతీ పెడితే తప్పక న్యూస్ కవర్ చేస్తారని,న్యూస్ కవర్ కు వచ్చిన వారి పై దాడి చేసి మోహన్ బాబు విలువలు,పోగొట్టుకున్నారన్నారు.మోహన్ బాబు పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు వైద్యానాద్ ,గిరీష్ స్వామి, రఘు,అశోక్,రాజు తదితరులుఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App