Atrocities Act does not apply if caste is not the target
ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు జరిగిన ప్రతీ అవమానం, బెదిరింపు వ్యాఖ్యలు ఆ వర్గాలపై అఘాయిత్యాల నిరోధక చట్టం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ పీబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఒక కేసులో ఈ చట్టానికి సంబంధించి వ్యాఖ్యానం చేసింది. మరునాదన్ మలయాళీ యూట్యూబ్ చానెల్ ఎడిటర్ షాజన్ షకీరాపై ఇదే చట్టం కింద నమోదైన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కేరళ ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ను అవమానించే విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ వీడియోను అప్లోడ్ చేశారన్నది షాజన్ షకీరా మీద అభియోగం.
బాధితుడు ఎస్సీ లేదా ఎస్టీ అన్న ఒకే ఒక కారణంతో అవమానించిన వాడి మీద సదరు చట్టం వాడటం కుదరదని జస్టిస్ పార్థీవాలా స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App