TRINETHRAM NEWS

Trinethram News : Mar 20, 2024,

ఏటీఎంలో చోరీకి యత్నం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ భగత్ సింగ్ నగర్ లోని ఎస్ బీఐ నగదు విత్ డ్రావెల్ కోసం ఏర్పాటు చేసిన ఏటీఎంలో చోరీకు యత్నం కలకలం రేపుతోంది. ఎవరో అపరిచిత వ్యక్తులు మంగళవారం రాత్రి సమయంలో ఏటీఎంలో చొరబడి చోరీకి పాల్పడ్డ ఆనవాళ్లు స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.