మహారాష్ట్ర, ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Trinethram News : ముంబయి, రాంచీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నేడు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది..
మరోవైపు ఝార్ఖండ్లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకూ నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 23న వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మహారాష్ట్రలో భాజపా, శివసేన, ఎన్సీపీల కూటమి మహాయుతి.. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఎస్పీ)ల కూటమి మహా వికాస్ అఘాడీల (ఎంవీఏ) మధ్య పోటీ ఉంది. మహాయుతిలోని భాజపా 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంవీఏలోని కాంగ్రెస్ 101, శివసేన (ఉద్ధవ్) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 సీట్లలో తలపడుతున్నాయి. 288 స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఝార్ఖండ్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోరు జరుగుతోంది. ఇక్కడి 38 స్థానాలకు జరుగుతున్న రెండో విడతలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App