TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు:ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.