As soon as the floods receded the operation started
Trinethram News : Andhra Pradesh : బుడమేరును ఆక్రమించేసి అడ్డగోలుగా కట్టిన నిర్మాణాలతో .. ఎంత ప్రమాదమో… తాజాగా బయట ప డింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ వేగంగా విస్తరిస్తోంది. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ దోచుకుతినడమే పనిగా ఉండిపోయాయి. ఫలితంగా బడమేరు కుంచించుకుపోయింది. కబ్జాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ కారణంగా బుడమేరు ప్రవాహం సాగడం లేదు. మరోసారి ఇలాంటి ప రిస్థితి వస్తే.. ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి. అందుకే ప్రభుత్వం బుడమేరును సంస్కరించాలని నిర్ణయించింది. బుడమేరులో కబ్జాల లెక్క తీసి..
ఎవరెవరు అమ్ముకున్నారు.. ఎవరెవరు కొనుగోలు చేశారో మొత్తం కేసులు పెట్టి … బుడమేరు పరిధిలో ఉన్న ఇళ్లన్నీ కూల్చివేసే అవకాశం ఉంది. సామాన్యులు ఎవరైనా ఆ ఇళ్లను కోనుగోలు చేసి ఉంటే.. వారికి కబ్జాలు చేసి అమ్మిన వారి వద్ద నుంచే డబ్బులు వసూలు చేసి పరిహారం ఇప్పించే ఆలోచన చేసే అవకాశం ఉంది. వైసీపీ నేతలు ముఖ్యంగా వెల్లంపల్లితో పాటు నాటి కొంత మంది ప్రజాప్రతనిధులు బుడమేరు మీద పడ్డారని అనేక సార్లు మీడియా కూడా వెలుగులోకి తెచ్చింది.
అయితే కబ్జాలు మా హక్కు అన్నట్లుగా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఐదేళ్ల పాటు నిరంతరాయంగా ఈ ఆక్రమణలు సాగాయి. ఇప్పుడు అదే వైసీపీ నేత వచ్చి బుడమేరు గురించి కథలు చెబుతున్నారు. ఆయనకు అవగాహన లేదు కాబట్టి… చేసిన కబ్జాలపైనా స్పష్టత లేదో.. ఆయనకు రావాల్సినవి అందాయో కానీ… ముందు ముందు అసలు సినిమా చూపించడంల ఖాయంగా కనిపిస్తోంది. బుడమేరును మేసిన వైసీపీ నేతల జాతకాలు గుట్టు బయటపడనుంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App