TRINETHRAM NEWS

As per the orders of Ramagundam Police Commissioner M. Srinivas IPS., (IG)

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం

,భీమారం నందు విద్యార్ధులకు మరియు సిబ్బందికి మహిళలు మరియు పిల్లల పై జరుగుతున్న లైంగిక నేరాలు, తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్. ఐ. హైమ.

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్, పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, పిల్లల రక్షణ మరియు భద్రత, షీ టీమ్స్, భరోసా సెంటర్ పనిచేస్తున్నాయని తెలిపారు. ర్యాగింగ్/ఈవ్ టీజింగ్/పోక్సో/ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ /టి సేఫ్ అప్/ఆత్మహత్యలు/డ్రగ్స్ /బాల్య వివాహాలు/వరకట్నం చట్టాలపై అవగాహన కల్పించారు. పిల్లలు, మహిళలను ఇబ్బందులకు గురి చేసేవారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

As per the orders of Ramagundam Police Commissioner M. Srinivas IPS., (IG)

కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు అందిస్తున్నామని ఏదైనా సమస్య ఉంటే డయల్ 100 కాల్ చేయాలని, స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లైంగికంగా వేధించటం, వెంటపడటము ఇటువంటి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైంగిక వేధిస్తే ఎవరైనా భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కొత్త వారిని గుడ్డిగా నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సామాజిక దురాచారాల నిర్మూలన,కుటుంబ అనుబంధాలు, సైబర్ నేరాలపై, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 1930 పై, మహిళలు మరియు బాలికలను ఎవరైనా వేధిస్తే రామగుండం షి టీమ్ నంబర్ 6303923700 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.మహిళల గురించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో షి టీమ్ సిబ్బంది మహిళా కానిస్టేబుల్ జ్యోతి, కానిస్టేబుల్ సతీష్ మరియు కేజీబీవి
భీమారంఎస్.ఓ.ఫణిబాల,ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.