TRINETHRAM NEWS

సిపిఎం పార్టి ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా దండబడు _లింబగూడ రహదారి కీ మోక్షం

అరకు వ్యాలీ: అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్. డిసెంబర్ 09:

ఎటకేలకు దండబడు లింబగుడా గ్రామాలకు రెండు కిలోమీటర్లుకు 90 లక్షలతో డబ్ల్యూ బి ఎమ్ రోడ్డు పనులుకు సర్పంచ్ గెమ్మెల చిన్న బాబు ఆధ్వర్యంలో శంకుస్థాపన.అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయతీ దండబడు నుండి లింబా గుడ వరకు సుమారు రెండు కిలోమీటర్లు 90లక్షలతో మంజూరైనా డబ్ల్యూ బి ఎమ్ రోడ్డు పనులుకు సుంకర మెట్ట సర్పంచ్ గెమ్మెల చిన్న బాబు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోడ్డు కొరకు ఎన్ని సార్లు విన్నవించుకొన్న ఎన్ని ప్రభుత్వాలు మారిన పరిష్కరానికి నోచుకో లేదు.
ఏటాకేలకు రోడ్డు మంజూరు అయ్యింది .గతంలో కూడ ఆ రోజు ఉన్న ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేసారు అయిన పనులు పూర్తి చేయలేదు. ఈ రోజు ఈ రోడ్డు దండ బడు నుండి లింబ గుడా వరకు రెండు కిలోమీటర్లు రోడ్డు పూర్తి చేసి నట్లయితే ఈ రెండు గ్రామాల ప్రజాలకె కాకుండా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ ప్రజాలకు కూడ ఉపయోగకరంగా ఉంటుంది.ఇటువంటి తక్కువ కిలోమీటర్లలోనే అన్ని గ్రామాలకు అనుసంధానం చేసే రోడ్డు మార్గం కల్పించే ఈ రోడ్డును గుత్తే దారులు గతంలో చేసినట్టు శంకుస్థాపన వరకు పరిమితం చేయకుండా సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేసి ఆ య గ్రామాలకు రోడ్డు మార్గం కల్పించడానికి కృషి చేయగలరన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పి.రాజు,కేశవ్, బాబురావు వార్డు మెంబెర్ దేవన్న పి.రాము గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App