రేపు జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారా ? ఎన్టీఏ కీలక మార్గదర్శకాలు …
Trinethram News : Andhra Pradesh : ఈ ఏడాది జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షలకు రంగం సిద్దమవుతోంది. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులకు ఇవాళ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
బీఈ, బీటెక్ అభ్యర్ధుల కోసం జనవరి 22 నుంచి సెషన్ 1 పేపర్ 1 పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్ధులకు పరీక్షల విషయంలో మార్గదర్శనం చేసేలా ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో సెషన్ 1, ఏప్రిల్ లో సెషన్ 2 పరీక్షలు జరగనున్నాయి.
సెషన్ 1 అయినా సెషన్ 2 అయినా పేపర్ 1 లో బీఈ, బీటెక్ అభ్యర్ధులకు పరీక్షలు ఉంటాయి. అలాగే బీఆర్క్, బీ ప్లానింగ్ అభ్యర్ధులకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. బీఆర్క్, బీప్లానింగ్ రెండు పరీక్షలు కలిపి రాసే వారికి 3 గంటల 30 నిమిషాల పరీక్ష సమయం ఉంటుంది. జనవరి 22 నుంచి పేపర్ 1 పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. 29న ముగుస్తాయి. అలాగే పేపర్ 2 పరీక్షలు జనవరి 30 నుంచి ఉంటాయి.
JEE మెయిన్ 2025 సెషన్ 1 రాసే అభ్యర్ధులు అడ్మిట్ కార్డ్ ప్రింట్ అవుట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అలాగే జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్ హార్డ్ కాపీతో పాటు, ఒరిజినల్లో ఫోటో గుర్తింపు రుజువును కూడా అభ్యర్థులు తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డ్‌పై ఫోటోగ్రాఫ్‌ను అతికించాలి. పరీక్షా కేంద్రానికి ఫోటోగ్రాఫ్‌ల రెండు అదనపు కాపీలను తీసుకెళ్లడం మంచిది. హాజరు షీట్లో ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా అతికించవలసి ఉంటుంది. ఆన్లైన్ జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫారమ్‌తో అప్లోడ్ చేసిన విధంగానే పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ ఉండాలి.
పరీక్ష హాల్లోకి జామెట్రీ , పెన్సిల్ బాక్స్, హ్యాండ్‌బ్యాగ్, పర్స్, ఏ రకమైన కాగితం, స్టేషనరీ, టెక్స్ట్ మెటీరియల్, తినుబండారాలు, నీరు, మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, స్లయిడ్ రూల్స్, లాగ్ టేబుల్లు, కెమెరా, టేప్ రికార్డర్, మెటాలిక్ వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పరికరాలు అనుమతించరు. ఉంగరాలు, కంకణాలు, చెవిపోగులు, అలంకారాలు వంటి లోహ మూలకాలను ధరించకూడదు. మందపాటి సోల్ ఉన్న బూట్లు ధరించరాదు. సరళమైన, సౌకర్యవంతమైన దుస్తులను వేసుకోవాలి. స్కార్ఫ్ కూడా ధరించకూడదు.
పేపర్ 2 జేఈఈ మెయిన్ డ్రాయింగ్ పేపర్ కోసం అభ్యర్థులు తమ సొంత జామెట్రీ బాక్స్ సెట్, పెన్సిళ్లు, ఎరేజర్లు, కలర్ పెన్సిల్లు, క్రేయాన్లను తీసుకెళ్లాలి. అభ్యర్థులు డ్రాయింగ్ షీట్‌పై వాటర్ కలర్లను ఉపయోగించకూడదు. షుగర్ పేషంట్ విద్యార్థులు మాత్రలు, పండ్లు, పారదర్శక నీటి సీసాలు, తినుబండారాలు తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. ప్యాక్ చేసిన ఆహారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు.
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App