TRINETHRAM NEWS

ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!

Trinethram News : 2025లో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. కొత్త ఆర్‌బీఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమల్లోకి రానుంది. యూపీఐ సేవను ఉపయోగించే పబ్లిక్.. ఈ నియమాలను తెలుసుకోవడం అత్యవసరం అనే చెప్పాలి. యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలు, వాటి ద్వారా జరిగే మార్పులను వివరంగా చూద్దాం..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన కొత్త నిబంధనలు డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం, మార్పును చూపుతాయి. ముందుగా యూపీఐ లావాదేవీ పరిమితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. అంటే జనవరి 1 నుండి UPI 123 చెల్లింపు లావాదేవీల్లో పరిమితిని పెంచారు. గతంలో UPI చెల్లింపు పరిమితి కేవలం రూ.5,000 కాగా, ఇప్పుడు దానిని రూ.10,000కి పెంచారు. రిజర్వ్ బ్యాంక్ ఈ కొత్త నిబంధనను ప్రకటించినప్పటికీ.. బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలను పాటించడానికి, వినియోగదారులకు సేవలను అందించడానికి సమయం ఇచ్చారు. ఈ వ్యవధి డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. అలాగే, జనవరి 1 నుండి కొత్త యూపీఐ చెల్లింపులు చెల్లింపు లావాదేవీ పరిమితిని అనుసరించాలని బ్యాంకులకు సూచించింది.

జనవరి 1 నుండి యూపీఐ డబ్బు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా.. కొన్ని కొత్త నిబంధనలు కూడా అమలులోకి వస్తాయి. దీని ప్రకారం, UPI 123 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా రుసుమును విధించరు. అంతే కాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా రెమిటెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. అంటే ఫీచర్ ఫోన్ల ద్వారా ఐవీఆర్… అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నెంబర్‌ను ఉపయోగించి డబ్బు లావాదేవీలు చేయవచ్చు. సో.. మీ ఫోన్ కు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరమే లేదు. అదే విధంగా జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డిజేబుల్ అవుతుంది. ఒకవేళ పాన్ కార్డ్ డిజేబుల్ అయితే, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలను నిర్వహించడం సాధ్యం కాదు. సో.. ఈ రెండు అంశాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App