అరకు వేలి శారదా నికేతన్ పాఠశాలలో ఘనంగా డి. శారదా 21వ వర్ధంతి.
అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.18 :
అరకువేలి శారదా నికేతన్ పాఠశాలలో ప్రధానోపాద్యాయుడు ఎస్.చిరంజీవి అధ్యక్షతన లొ.డి.శారదా 21 వర్ధంతి ఘనంగా జరిగింది. ముందుగా పూల మాలతో ఆమె చిత్ర పట్టాని నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న అరకు సి.ఐ.ఎల్.హిమగిరి, అరకు వేలి ఎమ్.ఇ.ఒ.వి.త్రినాధ్ అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు.
ఈ సందర్భంగా సీఐ. ఎల్.హిమగిరి మాట్లాడుతూ రేపటి తరానికి మూల స్తంభాలుగా విద్యార్ధిని, విద్యార్థులు చదువుల వైపు దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరాలని సైబర్ నేరాల నుండి దూరంగా ఉండాలి. గంజాయి, లాంటి మహమ్మారి మత్తు వంటి వాటిని ఎడిట్ కాకుండా అవగాహనతో ఉండాలని అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన తల్లితండ్రులకు గాని పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని శారదా గారి ఆశయాలు ఆమె స్ఫూర్తిని కొన్నసాగిస్తూ ఉన్నత శిఖరాలవైపు నడవాలని కోరారు. ఎమ్.ఇ.ఒ త్రినాధ్ మాట్లాడుతూ శారదా గారి ఆశయాలు మరువలేనివి, ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలతో సతమతమవుతున్న సమయంలో మహిళల హక్కుల కోసం, శ్రామిక మహిళల శ్రమ దోపిడి కోసం ఎంతో కృషి చేశారు.
అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ శారదా అమ్మ అప్పటి రోజుల్లో శ్రామికులకు, కార్మికులకు సమస్యల వలయంలో సతమతం అవుతున్నప్పుడు దిక్సూచిలా శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి అండగా నిలిచారు.
మా లాంటి నాయకులు ఎందరో ఉద్యమంలో ఉండి ప్రజల సమస్యలపై పని చేయడం దిశానిర్దేశం చేశారు,
కొంతమంది బ్రతికినంత కాలం ప్రజల కోసం బ్రతుకుతారు.చనిపోయిన తర్వాత కూడా వారి ఆశయాలు సజీవంగానే నడిపిస్తాయి.ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులు వారి ఆశయాలతో మంచి లక్ష్యం కలిగి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కిండంగి.రామారావు ఐద్వా నాయకులు వి.వి.జయ, ప్రత్యేక ఆహ్వానితులు శారదా గారి కుమార్తె ఐద్వా నాయకులు సుమీత్ర,రమణ, ఉపాధ్యాయులు విజాయ్, కృష్ణకుమారి,సంధ్య, నాగలక్ష్మి,దివ్య, కుమారి, సాయికుమార్, బాబురావు, జగన్, మహేష్,లు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App