చట్టాన్ని అతిక్రమించి వ్యాపారం చేస్తే ఎవరైనా సహించేది లేదు. అని వ్యాపారస్తులకు, హెచ్చరించిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.15 :
అరకువేలి అసెంబ్లీ నియోజవర్గం శాసనసభ్యులు రేగం మత్స్య లింగం పిలుపు మేరకు. శనివారం అక్షయఇన్ హోటల్లో, అరకువేలి వర్తక సంఘం మరియు వర్తకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్తక సంఘం వారికి గిరిజన చట్టాలను అతిక్రమించి వ్యాపారాలు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు ప్రజలకు కల్తీ వస్తువులు అమ్మకుండా చూడాలని న్యాయంగా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. రోడ్డు, నడక మార్గంలో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే గిరిజన చట్టాలను గౌరవించి ప్రతీ ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో అరకువేలి వర్తక సంఘం, ప్రతినిధులు కృష్ణారావు, సాంబయ్య, మయూరి రాజు, వెంకటేశ్వరరావు, మరియు అరకువేలి వర్తక సంఘంసభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App