కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజవర్గ అరకు వేలి మండలం త్రినేత్రం, న్యూస్ డిసెంబర్. 27 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆదేశాలు మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కరెంటు చార్జీల బాధుడుపై నేడు అనగా శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట కార్యక్రమం నిర్వహించనుంది. అందులో భాగంగా అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం కేంద్రంగా అరకువేలిలో నేడు ఉదయం: 11:00 గంటలకు గ్రీన్ వేలి హోటల్ జంక్షన్ నుంచి ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు, భారీ ర్యాలీగా వెళ్లి అధికారులకు ప్రజల సమస్యలను పూర్తి స్థాయి వివరాలతో వినతి పత్రం సమర్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కావున అరకు నియోజకవర్గ పరిధిలో గల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, పంచాయితీ, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలనీ, అరకు ఎమ్మెల్యే.రేగ మత్స్యలింగం, కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App