అరకులోయలో జనవరి 31 నుండి మూడు రోజులపాటు ఘనంగా అరకు కోల్డ్ ఫెస్టివల్స్.
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకులోయ టౌను/డిసెంబరు 30:త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్.
ఆంధ్ర ఊటీగా పేరుపొందిన అందాల అరకులోయలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31 నుండి మూడు రోజులపాటు, అరకు చలి ఉత్సవాలు పేరుతో వేడుకను జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు పాడేరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అరకు లోయకు చేరుకొని ఉత్సవాలు ఏర్పాటుకు స్థల పరిశీలన జరిపి, ఉత్సవాల విజయవంతానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
దేశంలో ఉన్న గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాలు ప్రాంగణంలో ప్రదర్శించేలా, పలు స్టాల్స్ , ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ తెలిపారు. ఇదే సమయంలో అరకు లోయను ప్లాస్టిక్ రహిత అందాల అరకులోయగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పి ఓ చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App