TRINETHRAM NEWS

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌ గా రిటైర్డ్ ఐఏఎస్ రామ్‌ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌ గా రిటైర్డ్ ఐపీఎస్‌ దీపక్ మిశ్రా, స్పెషల్‌ ఎక్స్‌ పెండిచర్‌ అబ్జర్వర్‌ గా రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి నీనా నిగమ్‌ నియమించింది. వచ్చే వారం నుంచి ప్రత్యేక ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఎక్కడికక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. మరోవైపు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలపై డేగ కన్నుతో రాజకీయ పార్టీలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ నాయకులతో పాటు, అధికారులు, ప్రభుత్వ సిబ్బందిపై కొరడా ఝులిపిస్తున్నారు.